: శ్వేతాబసునే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు?: సీరియల్ 'తల్లి' ప్రశ్నాస్త్రం


వ్యభిచారం కేసులో పట్టుబడిన నటి శ్వేతాబసు ప్రసాద్ కు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు లేదా? ఆమెనే మీడియాలో ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు టీవీ నటి సాక్షి తన్వర్. 13 ఏళ్ళ క్రితం వచ్చిన 'ఘర్ ఘర్ కి కహానీ' టీవీ సీరియల్లో సాక్షి... శ్వేతాబసుకు తల్లిగా నటించింది. తాజాగా, వ్యభిచారం కేసులో శ్వేతాబసు పేరు మీడియాలో మార్మోగిపోతుండడం పట్ల సాక్షి స్పందించింది. శ్వేతాబసు పేరు మాత్రమే మీడియాలో వస్తోందని, కానీ, ఈ వ్యవహారంలో ఉన్న వ్యాపారవేత్తల పేర్లు మాత్రం బయటికి రావడంలేదని అన్నారు. ఆమెకు మాత్రం గౌరవమర్యాదలుండవా? వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అన్ని ప్రశ్నించారు. శ్వేతాబసు తనతోపాటు సీరియల్ లో నటించినప్పుడు 9 ఏళ్ళ అమ్మాయి అని, ఎంతో ప్రతిభావని అని సాక్షి కితాబిచ్చింది.

  • Loading...

More Telugu News