: పది జిల్లాల తెలంగాణ కాదు... త్వరలో 24 జిల్లాల తెలంగాణ!
పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఇకపై 24 జిల్లాల రాష్ట్రంగా విస్తరించబోతోంది. పరిపాలన సౌలభ్యాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలను విభజించి అదనంగా మరో 14 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ఉద్యమసమయంలో కూడా పది జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు స్పష్టం చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లా కేంద్రానికి విసిరేసినట్లుగా ఉండే ప్రాంతాలకు చేరువగా ఉండేలా మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది.