: ఇక ఆన్ లైన్ విక్రయాలకూ ట్విట్టర్ సన్నాహాలు!


ఇప్పటికే ఆన్ లైన్ విక్రయాల్లో ఈ కామర్స్ సంస్థలు దూసుకుపోతున్న నేపథ్యంలో వాటి బాట పట్టేందుకు సామాజిక సంబంధాల వెబ్ సైట్ ట్విట్టర్లో తెర లేవనుంది. తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలన చేసేందుకు ట్విట్టర్ సోమవారం నుంచే రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా అమెరికాలోని తన వినియోగదారులకు పరిమిత సంఖ్యలో విక్రయ ఆఫర్లను ట్విట్టర్ అందించడం మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లను వినియోగిస్తున్న తన కస్టమర్లకు ‘బై’ బటన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫ్యాన్సీ, మ్యూజిక్ టుడే వెబ్ సైట్లు ఆఫర్ చేస్తున్న ఉత్పత్తులను తన ద్వారా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. తొలి దశ ప్రయోగాత్మక ఫలితాలను ఆధారం చేసుకుని విక్రయాల కోసం కొత్తగా ప్రవేశపెట్టనున్న ‘బై’ బటన్ ను కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ట్విట్టర్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News