: ఆ వ్యర్థ డీఎన్‌ఏలు కూడా పరిశోధనకు పనికొస్తాయ్‌


'నథింగ్‌ వేస్ట్‌ ఇన్‌ దిస్‌ వరల్డ్‌' అని సామెతను కొత్తగా తయారుచేసుకోవాలేమో! జన్యుపటం ఆవిష్కరణలో పాల్గొన్న తొలినాటి శాస్త్రవేత్తలు కొన్ని రకాల డిఎన్‌ఏలను పనికిరాని వ్యర్థాలుగా గుర్తించారు. వాటిని లాంగ్‌ నాన్‌కోడిరగ్‌ ఆర్‌ఎస్‌ఏగా పిలిచారు. కానీ అవి నిజంగా ఆర్‌ఎన్‌ఏలు కాదుట. డీఎన్‌ఏ మూసలో తయారైన ఆర్‌ఎన్‌ఏ వంటి పదార్థాలుట. అందువల్ల వాటిని చెత్త డీఎన్‌ఏ అని ముద్ర వేసి పక్కన పెట్టారు. అయితే ఇవి కూడా చాలా కీలకమైనవని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

శాన్‌ఫ్రాన్సిస్కో కాలిపోర్నియా యూనివర్సిటీకి చెందిన అలెగ్జాండర్‌ రామోస్‌ తన తాజా గణనలతో వీటి గురించి పాత శాస్త్రవేత్తల అభిప్రాయం తప్పని నిరూపించాడు. హటింగ్టన్‌ డిసీజ్‌ అనే మెదడు వ్యాధి, అల్జీమర్స్‌, మూర్ఛ, కొన్ని రకాల కేన్సర్‌లకు వీటికి మధ్య కొంతమేర సంబంధం ఉందని రామోస్‌ తేల్చాడు. మెదడులో రెండువేల రకాల కణాల రూపకల్పనలో వీటి ప్రభావం ఉంటుందిట. రామోస్‌ పరిశోధన డీఎన్‌ఏల ప్రభావంపై మరిన్ని ఆవిష్కరణలకు దారితీయవచ్చునని అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News