: దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి 26 ప్రత్యేక రైళ్లు


దసరా పండుగకు జంటనగరాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తమ ఊళ్లకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో, బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుంటాయి. రిజర్వేషన్లు దొరకక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సికింద్రాబాద్-మచిలీపట్నం-సికింద్రాబాద్ మధ్య మరో 10 రైళ్లు, సికింద్రాబాద్-గౌహతి-సికింద్రాబాద్ మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

  • Loading...

More Telugu News