: మోడీకి ధన్యవాదాలు తెలిపిన పాక్ ప్రధాని


భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్ లోని వరద ప్రాంతాల్లో భారత్ చేసిన సాయాన్ని ఆయన ప్రశంసించారు. భారత్ చేసిన సేవలు మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ను వరదలు ముంచెత్తడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని పలుప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారత సేనలు మొక్కవోని ధైర్యంతో విద్వేషాలు లేకుండా వరదల్లో చిక్కుకున్న వారికి సహాయసహకారాలు అందజేశాయి. వారిని ఒడ్డుకు చేర్చడం, అన్నపానీయాలు సమకూర్చడం వంటి సహాయకార్యక్రమాలు చేపట్టాయి. దీంతో పాక్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News