: మతం మార్చుకోండి లేదా చంపుతాం...బీహార్లో బెదిరింపులు
బీహార్ లో మతం మార్పిడిల దుమారం రావణకాష్టంలా రాజుకుంటోంది. సీతమంఢి జిల్లా రాంపూర్ ఖర్ధ్ కు సమీపంలోని పుప్రికి చెందిన కొంతమంది దుండగులు మతం మార్చుకోవాలని, లేని పక్షంలో కుటుంబంలోని అందర్నీ చంపుతామని ఓ దళిత కుటుంబంపై బెదిరింపులకు దిగారు. దీంతో భీతిల్లిన ఆ కుటుంబ యజమాని రాజ్ కిశోర్ రాం ముస్లిం మతంలోకి మారాడు. అతని భార్య యశోదాదేవి, ఇతర కుటుంబ సభ్యులను కూడా బెదిరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.