: గర్ల్ ఫ్రెండ్ కోసం బంధువునే కాల్చేశాడు


ప్రేమించిన యువతిని దగ్గర బంధువు ఇష్టపడుతున్నాడనే కారణంతో ఓ వ్యక్తి అతడ్ని కాల్చి చంపేశాడు. గుర్గావ్ లో ఉంటున్న ప్రదీప్ కుమార్, లలిత్ (27) ఇద్దరూ సమీప బంధువులు. వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే తాను ప్రేమించిన యువతిని ప్రదీప్ ఇష్టపడుతున్నాడని లలిత్ కు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న ఒక పుట్టినరోజు పార్టీకి హాజరైన వారిద్దరూ ఆ అమ్మాయి తనదంటే తనదని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. ఆ సమయంలో తన బంధువు ప్రదీప్ కుమార్ పై లలిత్, అతని స్నేహితుడు హర్లూ దాడి చేశారు. ఈ క్రమంలో ఆవేశం ఆపుకోలేకపోయిన లలిత్ తన వద్దనున్న నాటు తుపాకీతో ప్రదీప్ ను కాల్చిచంపేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిద్దరిపైనా అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News