: నిత్యానంద మగాడే... లైంగికపటుత్వ పరీక్షల్లో నిగ్గుతేలిన నిజం!
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్వామిజీ, ధ్యానపీఠ అధిపతి నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నిజం నిగ్గుతేలింది. తాను నపుంసకుడినని, తనలో మగతనం లేదని పలు మార్లు చెప్పిన నిత్యానంద, ప్రపంచాన్ని తప్పుదోవపట్టించాడని నిర్థారణ అయింది. లైంగిక పరీక్షల్లో ఆయనకు లైంగిక సామర్థ్యం ఉన్నట్టు వెల్లడైందని సమాచారం. దీంతో గతంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనన్న సత్యం రూఢీ అయింది. గతంలో నిత్యానంద సినీనటి రంజితతో రాసలీలలు నెరపుతున్న వీడియోలు బయటపడిన సంగతి తెలిసిందే.