: పూటుగా తాగి మూడు బైకులు, ఒక కారును ఢీ కొట్టాడు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదని ట్రాఫిక్ పోలీసులు చెవినిల్లు కట్టుకుని పోరుతున్నా వాహనదారుల్లో మార్పురావడం లేదు. విశాఖపట్టణం జిల్లా అరుకులో ఓ తాగుబోతు పూటుగా తాగి వీరంగమేశాడు. విపరీతంగా మద్యం తాగి, జీపును డ్రైవ్ చేస్తూ మూడు బైకులు, ఓ కారును ఢీ కొట్టాడు. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.