: ఆరు నెలలైనా కనుక్కోలేకపోయారు!


సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ దేశాలు ముందంజ వేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకుంటున్నాం. విశ్వం రహస్యాలు అన్వేషించేందుకు నిత్యం మన శాస్త్రవేత్తలు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ, భూమిపై చోటు చేసుకునే మిస్టరీల అంతు తేల్చడంలో మాత్రం మనిషి పురోగతి సాధించలేకపోతున్నాడు. ఆరు నెలల క్రితం అదృశ్యమైన మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 ఆచూకీ నేటికీ దొరకలేదు. ఈ విమానం కోసం విస్తృతంగా గాలించినా ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయామని ఆస్ట్రేలియా అధికారులు చేతులెత్తేశారు. గత మార్చి 8న 239 ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఎంహెచ్ 370 విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన 40 నిమిషాలకు అంతుచిక్కని తీరాలకు చేరిపోయింది. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉంటుందని అధికారులు భావించి, విస్తృతంగా గాలించినప్పటికీ దాని జాడ చిక్కలేదు. కాగా, ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు అసలు తమ బంధువులు ఎలా మరణించారో తెలియని సందిగ్ధంలోనే వున్నారు.

  • Loading...

More Telugu News