: విద్యాసాగరరావుతో భేటీ అయిన మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ తో రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. సుమారు 35 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో మహారాష్ట్రకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. గవర్నర్ గా విద్యాసాగరరావు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సీఎం ఆయనతో భేటీ అయ్యారు. గవర్నర్ గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.