: 218 బొగ్గు గనులపై సుప్రీంకోర్టులో అఫిడవిట్
దేశంలో 218 బొగ్గు గనులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అక్రమంగా కేటాయించిన బొగ్గు గనుల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. కాగ్ తప్పుపట్టిన బొగ్గుగనుల కేటాయింపులకు తోడు, మరో 46 బొగ్గు గనుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లో పొందుపరిచింది.