: యువీ ఫేస్ బుక్ అకౌంట్ కు ఆరు మిలియన్ల లైకులు
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫేస్ బుక్ అకౌంట్ ను లైక్ చేసిన వారి సంఖ్య ఆరు మిలియన్లు దాటింది. అభిమానులకు బాగా అందుబాటులో ఉంటాడని యువీకి పేరుంది. అతని అకౌంట్ ను ఇప్పటివరకు 60, 03,855 మంది లైక్ చేశారట. దీనిపై, యువీ స్పందించాడు. తనను ఆదరిస్తున్న అభిమానులకు థాంక్స్ చెప్పాడు. కాగా, యువీ ట్విట్టర్ ఖాతాను 2.49 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.