: మమ్మల్ని అడగడం కాదు... కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి: వసుంధర రాజే
కొత్తగా అధికారం చేపట్టిన తమపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం కాకుండా, గత 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శించారు. రాజస్థాన్ లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, సామాన్య ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని అన్నారు.