: మంత్రి సదానంద కుమారుడికి ముందస్తు బెయిల్


కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడకు బెంగళూరు సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి కుమారుడిపై కన్నడ నటి మైత్రేయ మోసం, అత్యాచారం, కిడ్నాప్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి నెల 15, 30వ తేదీలో పోలీసుల ముందు హాజరుకావాలని, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.2 లక్షల వ్యక్తిగత బాండు సమర్పించాలన్న షరతుల మేరకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అటు ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు కార్తీక్ తన పాస్ పోర్టును సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కోర్టు ముందుకు హాజరుకాకుండా సదానంద కుమారుడు పరారీలో ఉన్నట్లు వార్తలు రావడంతో, ఎనిమిదవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 5న అరెస్టు వారెంట్, లుకౌట్ నోటీసు జారీ చేసింది.

  • Loading...

More Telugu News