: శిల్పాశెట్టిని ఏడిపించిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఏడిపించింది. వారిద్దరూ గొడవపడడం వల్ల శిల్పా ఏడవలేదు. ప్రియాంక చోప్రా నటించిన 'మేరీకోమ్' సినిమా చూసిన శిల్పాశెట్టి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక ఏడ్చేసింది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి ట్విట్టర్లో పేర్కొంది. సినిమాలో ప్రియాంక అద్భుతంగా నటించిందని, తొలి సినిమాకు దర్శకత్వం వహించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వం అద్భుతంగా ఉందని ఆమె తెలిపింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని ట్వీట్ చేసింది.