: సుబ్రహ్మణ్య స్వామిపై సీఎం జయ పరువునష్టం దావా
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం దావా దాఖలు చేశారు. ఇటీవల శ్రీలంక స్వాధీనం చేసుకున్న పడవలు జయ సన్నిహితురాలు శశికళ, డీఎంకే నేత టీఆర్ బాలువని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖలో స్వామి తెలిపారు. అంతేగాక ముల్లపెరియార్ డ్యాం ఎత్తు పెంపు విషయంలో కేంద్రం నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయడం తన కృషి వల్లే సాధించినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అటు రామ సేతును కూడా తానే రక్షించినట్లు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జయ పరువునష్టం దావా వేశారు.