: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదనలు రెడీ: నిర్మలాసీతారామన్
విశాఖపట్టనం-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ లో ప్రస్తావించినట్టు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. అలాగే బెంగళూరు-చెన్నై, బెంగళూరు-ముంబై పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఆమె తెలిపారు.