: 100 కోట్ల మంది ఆ వీడియోలను చూస్తున్నారట
సామాజిక మాధ్యమాల్లో ఫేస్ బుక్ కు ఉన్న క్రేజే వేరు. ఫేస్ బుక్ లో అకౌంట్ ఉంటే రోజులో ఒకసారైనా ఓపెన్ చేయకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. సామాజిక మాధ్యమాల్లో అగ్రస్థానాన ఉన్న ఫేస్ బుక్ తమ సైట్ లో అప్ లోడ్ అయిన వీడియోలను ప్రతి రోజూ ఒక బిలియన్ (100 కోట్ల) మంది వినియోగదారులు చూస్తున్నారని ప్రకటించింది. ఇందులో 65 శాతం మంది తమ మొబైల్ ద్వారానే వీడియోలు చూస్తున్నారని తెలిపింది. ప్రతి నెలా 1.32 బిలియన్ ప్రజలు ఫేస్ బుక్ తో అనుసంధానం అవుతున్నారని వెల్లడించింది. ఇలా అనుసంధానమవుతున్న వారిలో మొబైల్ యూజర్లే ఎక్కువని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. జూన్ లో ఒక బిలియన్ కు పైగా యూజర్లు ఫేస్ బుక్ వీడియోలను వీక్షించారని ఫేస్ బుక్ ప్రకటించింది.