: టీడీపీలో 'ట్యాబ్' కల్చర్ కు నారా లోకేశ్ సన్నాహాలు


తెలుగుదేశం పార్టీలో సాంకేతిక విప్లవానికి తెరదీస్తున్నారు కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్. పార్టీలో 'ట్యాబ్' కల్చర్ ను ప్రవేశపెట్టాలని లోకేశ్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇకపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి, నేతలతో పాటు కార్యకర్తలకు ట్యాబ్లెట్ కంప్యూటర్లు అందజేసే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ కార్యకలాపాలన్నింటినీ ట్యాబ్లెట్ల ద్వారానే నడిపించాలన్నది లోకేశ్ యోచన. క్షేత్రస్థాయి నుంచి వచ్చే ప్రతిపాదనలు, సూచనలను పార్టీ ప్రధాన కార్యాలయంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News