: యూఎస్ ఓపెన్ హ్యాట్రిక్ టైటిల్ సాధించిన నల్లకలువ
యూఎస్ ఓపెన్ మహిళల టెన్నిస్ ఫైనల్స్ లో అమెరికా నల్లకలువ జయకేతనం ఎగురవేసింది. ఫైనల్లో సెరెనా విలియమ్స్ ప్రత్యర్థి కరొలినా వోజ్నియాకిపై 6-3, 6-3 వరుస సెట్లలో గెలిచి టైటిల్ సాధించింది. వరుసగా మూడోసారి (హ్యాట్రిక్) యూఎస్ టైటిల్ సాధించిన సెరెనాకు ఇది 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో ఆమె మహిళల టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు సాధించిన క్రిస్ ఎవర్ట్, మార్టినా నవ్రతిలోవా సరసన చేరింది. అమెరికన్ నల్లకలువ సెరెనా విలియమ్స్ ఇప్పటి వరకు ఆరుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని సత్తా చాటింది.