: ఈసారి 'ఎయిట్ ప్యాక్'తో వస్తున్న షారుక్


నటుడు షారుక్ ఖాన్ ఏడేళ్ల తర్వాత మళ్లీ 'ప్యాక్' బాడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి 'ఎయిట్ ప్యాక్' దేహంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించబోతున్నాడు. దర్శకురాలు ఫరాఖాన్ తో చేస్తున్న 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో తన పరిచయ సన్నివేశంలో కింగ్ ఖాన్ ఈ అద్భుతమైన ఎయిట్ ఫ్యాక్ లో దుమ్ము రేపనున్నాడట. కేవలం ఫరా కోసమే తాను ఎయిట్ ప్యాక్ తో వస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపాడు. దానికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్టు చేశాడు. ఈ సందర్భంగా బాద్షా మాట్లాడుతూ, "ప్రస్తుతం నా దేహం గురించి మాట్లాడేందుకు సిగ్గు పడుతున్నాను. కానీ, ఇది కేవలం ఫరాఖాన్ కోసమే చేస్తున్నాను. ఇక ఈ విషయంలో, నా శిక్షకుడు ప్రశాంత్, కుమారుడు ఆర్యన్ నన్ను చాలా ప్రోత్సహించారు" అని తెలిపాడు. ప్రస్తుతం షారుక్ ఫొటోలు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో ఫరా తెరకెక్కించిన 'ఓం శాంతి ఓం' చిత్రంలో 'దర్దె డిస్కో...' పాటలో ఖాన్ తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. అప్పుడే సినీ పరిశ్రమకు ఈ విధానం పరిచయం కావడంతో తర్వాత చాలా మంది హీరోలు అనుసరించారు.

  • Loading...

More Telugu News