: హెలికాప్టర్ నుంచి పూలవాన చూసేందుకు పోటెత్తిన భక్తులు
నిమజ్జనానికి తరలివెళ్లడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. మరికొన్ని గంటల్లో ఈ భారీ గణనాథుని తరలించనున్నారు. ఈ క్రమంలో, ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా వినాయకుడిపై పూలవాన కురిపించబోతోంది. దీంతో, ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ తరలివస్తున్నారు. ఇప్పటికే వినాయకుడిని నెలకొల్పిన ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది.