: ఫక్తు శాకాహారులా... అయితే, మీలో బీ12 విటమిన్ లోపించినట్టే!


శాకాహారం సర్వశ్రేష్టం అని భావిస్తారు. డాక్టర్లు కూడా అదే సలహా ఇస్తారు. కానీ, శాకాహారుల్లో బీ12 విటమిన్ లోపం తలెత్తుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 32 ఏళ్ళ నుపుర్ డే స్వోరే అని మహిళ బరువు కోల్పోవడం, పాదాలలో చురుకులు వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆమె ఫక్తు శాకాహారి. డాక్టర్ వద్దకు వెళ్ళగా పలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దాంట్లో, ఆమెకు బి12 విటమిన్ లోపం ఉన్నట్టు తేలింది. దీనిపై, మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ అనిల్ అరోరా మాట్లాడుతూ, స్వచ్ఛమైన శాకాహారం తీసుకునే భారతీయుల్లో అత్యధికులు బీ12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారని వివరించారు. గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులను తగినంత స్థాయిలో తీసుకోకపోతే శరీరానికి అవసరమైన స్థాయిలో బీ12 విటమిన్ లభించదని తెలిపారు.

  • Loading...

More Telugu News