: కాశ్మీర్ ప్రజల క్షేమాన్ని కోరుతూ బాలీవుడ్ నటుల ప్రార్థన


భారీ వర్షాల కారణంగా గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జమ్మూకాశ్మీర్ ను వరదలు ముంచెత్తాయి. కకావికలమైన కాశ్మీర్ లో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు వంద మందికి పైగా మరణించారు. ఇళ్లు కొట్టుకుపోయి వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ పరిస్థితిపై పలువురు బాలీవుడ్ నటులు ట్విట్టర్ లో స్పందించారు. రాష్ట్రంలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నామని వారు తెలిపారు. ఈ మేరకు "కాశ్మీర్ లో వరద పరిస్థితి కొన్ని రోజుల్లో చక్కబడాలని ఆశిస్తున్నా. అందుకుగానూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అని నటుడు షారుక్ ఖాన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. నటుడు బొమన్ ఇరానీ ట్వీట్ చేస్తూ, కాశ్మీర్లో వరదలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నానన్నారు. అంతేగాక, సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి ధైర్యం, సహనం ఇవ్వాలని... తీవ్ర వేదనలో ఉన్న బాధితులకు ఆత్మ విశ్వాసం కలగాలని ప్రార్థిస్తున్నట్లు బొమన్ పేర్కొన్నారు. నటుడు అనుపమ్ ఖేర్, ఫర్హాన్ అక్తర్, కథానాయిక సోఫియా చౌదరి కూడా కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న వారి పట్ల తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News