: సచిన్ పేరిట క్రికెట్ సిరీస్!
భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కు మరో విశిష్ట గౌరవం దక్కనుంది. ఆయన పేరిట ఓ క్రికెట్ సిరీస్ ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భావిస్తోంది. త్వరలో జరిగే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుమంటామని బీసీీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ తెలిపారు. సచిన్ పేరిట సిరీస్ ఏర్పాటు చేయడాన్ని ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నామని పటేల్ పేర్కొన్నారు. బీసీసీఐ యోచనకు ఆమోదముద్ర పడితే, భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, భారత్-ఇంగ్లండ్ మధ్య పటౌడీ ట్రోఫీ తరహాలోనే సచిన్ పేరిట కూడా ఓ ట్రోఫీ ఏర్పాటవుతుంది.