: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 'కొత్త వాహన' యోగం


నయా పోలీసింగులో భాగంగా హైదరాబాద్ పోలీసులకు కొత్త వాహనాల కొనుగోలు కోసం బడ్జెట్ లో 300 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేటాయించింది. ఈ క్రమంలోనే తొలివిడతగా తెలంగాణ ప్రభుత్వం 100 ఇన్నోవా వాహనాలు... 300 టూ వీలర్స్ ను హైదరాబాద్ పోలీసులకు అందజేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు ఏపీ పోలీసులకు కూడా కొత్త వాహనాలు కావాలని హోంశాఖమంత్రి చినరాజప్పతో పాటు ఆర్థికమంత్రిని యనమలను కూడా కోరారు. లోటు బడ్జెట్ కారణంగా... ఇప్పట్లో అలాంటి వాటికి బడ్జెట్ కేటాయించలేమని వారి దగ్గరనుంచి డీజీపీకి సమాధానం వచ్చింది. దీంతో... ఆ తరువాత ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి కొత్త వాహనాల అవసరాన్ని నొక్కి చెప్పడంతో పాటు... వాహనాల కొనుగోలు కోసం కనీసం 150 కోట్లైనా కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే, చంద్రబాబు... హోంమంత్రి చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమలతో మాట్లాడిన తర్వాత కొత్త వాహనాల కొనుగోలు కోసం 100 కోట్లను కేటాయించారు. దీంతో, అధికారులకు ఇన్నోవా కార్లు, సిబ్బందికి హోండా షైన్ బైకులు కొనుగోలు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది.

  • Loading...

More Telugu News