: భారత్ లో అల్ ఖైదా ఉనికే లేదు: అమెరికా


భారత్ లోనూ తమ విభాగాన్ని ఏర్పాటు చేశామని అల్ ఖైదా ప్రకటించిన నేపథ్యంలో దేశంలో అప్రమత్తత ప్రకటించడం తెలిసిందే. అయితే, భారత్ లో అల్ ఖైదా ఉనికే లేదని, భయపడాల్సిన పనిలేదని అంటున్నారు అమెరికా కౌంటర్ టెర్రరిజం నిపుణుడు పీటర్ బెర్గెన్. భారత్ లో విభాగం ఏర్పాటు చేయాలని అల్ ఖైదా నేత అయిమాన్ అల్ జవహరి భావించడం ఓ పిచ్చి నిర్ణయం అని బెర్గెన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో కొన్ని జిహాదీ శక్తులు పనిచేస్తున్నాయని, కానీ, అల్ ఖైదా ఉనికి ఉన్నట్టు ఆధారాల్లేవని స్పష్టం చేశారు. తన ఉనికిని చాటుకోవడం కోసమే జవహరి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్టుందని బెర్గెన్ విశ్లేషించారు. ఐఎస్ఐఎస్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో, అల్ ఖైదా ఇక నిన్నటి కథ అని తెలిసే వారు ఇలాంటి ప్రకటనలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News