: హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి వెళుతున్న ఆటో బోల్తా


హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి వెళుతున్న ఓ ఆటో మొజాంజాహీ మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఆటో ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్నవారంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఉన్న వాళ్లంతా ఒకవైపే ఉండడంతో, ఆవైపు బరువెక్కువై ఆటో బోల్తా పడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News