: నిఠారీ హంతకుడి ఉరి వారం వాయిదా!


నిఠారీ వరుస హత్యల కేసులో దోషిగా తేలిన సురేందర్ కోలీ ఉరి శిక్షను వారం పాటు వాయిదా వేస్తూ ఆదివారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఉరికంబమెక్కనున్న సీరియల్ కిల్లర్ మరో వారం పాటు బతికి ఉండేందుకు వీలు చిక్కింది. కోలీ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తును ఆయన అధికార నివాసంలో కలిశారు. కోలీకి విధించిన మరణశిక్షపై ఈ వారం చివరలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కోలీకి మరణ దండన విధిస్తూ ఘజియాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, తాజాగా మరోసారి కోలీ పిటీషన్ నేపథ్యంలో తుది విచారణ నిర్వహించేందుకు అంగీకరించింది. దీంతో కోలీ మరణశిక్ష వారం పాటు వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వులు ఆదివారం అర్ధరాత్రి మీరట్ జైలు అధికారులకు అందాయి. ఈ విషయాన్ని మీరట్ జైలు అధికారులు ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News