: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ


గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వదరనీటితో పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 53 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో, అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతంలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తుండటంతో, కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News