: కిడ్నీల పరస్పర మార్పిడితో పతులను రక్షించుకున్న సతులు!


ఆ ఇద్దరు మహిళల భర్తలు కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో నానాటికీ పతుల అనారోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో తమ కిడ్నీలను దానం చేసేందుకు ఆ మహిళలు సిద్ధపడ్డారు. అయితే తమ కిడ్నీలు తమ భర్తలకు సరిపోవని తేలింది. అయితే ఆశ్చర్యంగా ఒకరి భర్తకు మరొకరి కిడ్నీ సరిపోలింది. పరస్పరం సహకరించుకుని పతులను బతికించుకుందామన్న ఆ భార్యల వితరణ ఆ ఇద్దరు భర్తలకు ప్రాణం పోసింది. అత్యంత అరుదైన ఘటనగా వైద్యులు పేర్కొంటున్న ఈ ఘటన ఆదివారం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. సెయిల్ మాజీ ఇంజినీరు ఎస్బీ రాం, ఎన్ఎండీసీ ఉన్నతాధికారి సంత్ రాం లు మూత్రపిండాలు పాడవడంతో మూడేళ్లుగా డయాలసిస్ పై కాలం నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. రక్తస్రావం ఇబ్బంది పెడుతుండటమే కాక రక్తంలో ప్లేట్ లెట్ సంఖ్య క్రమంగా పడిపోతోంది. దీంతో భర్తలను ఎలాగైనా బతికించుకునేందుకు ఆ భార్యలిద్దరూ అవయవ దానం చేసేందుకు పూనుకున్నారు. అయితే అనూహ్యంగా ఒకరి భర్తకు, మరొకరి కిడ్నీ సరిపోతుందన్న విషయం తేలడంతో, భర్తలను బతికించుకునేందుకు ఆ మహిళలిద్దరూ కిడ్నీలను పరస్పరం దానం చేసుకుని భర్తలను బతికించుకున్నారు. ఇదిలా ఉంటే, ఆ భర్తలిద్దరి పేర్లు ‘రాం’ అన్న పదంతో ముగియడం విశేషం.

  • Loading...

More Telugu News