: టీమిండియా విజయ లక్ష్యం 181 పరుగులు
భారత్ తో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్, ప్రత్యర్థి జట్టుకు 181 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్లు 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్, మొదటి మూడు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో పడింది. అయితే ఇయాన్ మోర్గాన్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ఇంగ్లండ్ కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. భారత ఫేసర్ మొహ్మద్ షమీ బంతితో మేజిక్ చేశాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా మూడు వికెట్లు తీసిన షమీ, ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ను దెబ్బ తీశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ లో షమీ 38 పరుగులిచ్చాడు.