: చైనాలో రెండో సంతానానికి అనుమతి
శరవేగంగా వృద్ధి చెందుతున్న జనాభాకు చెక్ పెట్టేందుకు ఏక సంతానం నిబంధనను విధించిన చైనా, తాజాగా రెండో సంతానానికి ఎట్టకేలకు అనుమతించింది. దేశ రాజదాని బీజింగ్ లో రెండో సంతానం కోసం దరఖాస్తు చేసుకున్న 21,249 జంటలకు గాను 19,363 జంటలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దేశంలో తరాల మధ్య సమతుల్యత దెబ్బతిన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఏక సంతానం నిబంధనపై సడలింపు ప్రకటించిన చైనా ప్రభుత్వం, తాజాగా రెండో సంతానానికి అంగీకరించి, ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లైంది.