: హైదరాబాద్ చేరుకున్న టీఎస్ సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించిన సంగతి తెలిసిందే.