: బాక్సాఫీస్ పై ‘మేరీ కామ్ ’ పంచ్ అదిరింది!


భారత మహిళా బాక్సర్ మేరీకామ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘మేరీ కామ్’ పంచ్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను గడగడలాడిస్తోంది. బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా కీలక భూమిక పోషించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.17.25 కోట్ల వసూళ్లను రాబట్టి, సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచేసింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రం 1,800 ప్రింట్లతో రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మేరీకామ్ కలెక్షన్ల తుపానును సృష్టిస్తోంది. కేవలం అగ్రహీరోలు, మగ మహారాజుల చిత్రాలే బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయన్న సెంటిమెంట్ తప్పని తాజాగా ప్రియాంక చోప్రా రుజువు చేశారు. ఇదిలా ఉంటే, మేరీకామ్ సొంత రాష్ట్రం మణిపూర్ లో ఈ చిత్రం విడుదల కాకపోవడం గమనార్హం. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఈ చిత్రం విడుదల కాలేదు.

  • Loading...

More Telugu News