: తిరుమల 'సారంగి రెస్టారెంట్'లో నాణ్యత లోపించిన ఆహారం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు తరలివస్తున్న అశేష భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాల్సిన గురుతర బాధ్యతను విస్మరించిన సారంగి రెస్టారెంట్ పై ఆదివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను విస్తుగొలిపే పలు అంశాలు వెలుగు చూశాయి. కుళ్లిన కూరగాయలు, పాచిపోయిన ఆహార పదార్థాలు, పచ్చళ్లు, నాసిరకం ముడి సరుకులు విజిలెన్స్ అధికారులకు దర్శనమిచ్చాయి. చూడటానికే అసహ్యంగా ఉన్న పదార్థాలను ఆహారం తయారీలో ఎలా వినియోగిస్తున్నారన్న విజిలెన్స్ అధికారుల ప్రశ్నకు రెస్టారెంట్ యాజమాన్యం నీళ్లు నమిలింది. దీంతో రెస్టారెంట్ లోని పూర్తి స్థాయి స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేసేందుకు విజిలెన్స్ అధికారులు నిర్ణయించారు. కుళ్లిన పదార్థాలతో భోజనం పెడుతున్న సారంగి రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.