: కింగ్ ఫిషర్ బాటలో స్పైస్ జెట్!


విమానయానాన్ని సామాన్యులకూ అందుబాటులోకి తెస్తామంటూ బీరాలు పలికిన స్పైస్ జెట్, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ బాటలోనే పయనిస్తోంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు భారీ తగ్గింపు ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తున్న స్పైస్ జెట్, భారీ నష్టాల్లో మునిగిపోయిందన్న అంశంపై తాజాగా విమానయాన రంగంలో భారీ చర్చే నడుస్తోంది. అంతేకాక తన సిబ్బందికి స్పైస్ జెట్, నెలల తరబడి అలవెన్సులు చెల్లించలేదన్న విషయం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు విదేశీ యానాల్లో పాల్గొంటున్న పైలట్లు, సిబ్బందికి అలవెన్సులు ఇచ్చేది లేదంటూ ఆ సంస్థ తీర్మానించిన అంశం కూడా తాజాగా వెలుగు చూసింది. పరిస్థితిని చూస్తుంటే, కింగ్ ఫిషర్ బాటలోనే స్పైస్ జెట్ కూడా నడుస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని అందులో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News