: రూ.30 కోట్లకు సువర్ణ ఇండియా కుచ్చుటోపీ


అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి, వారి డబ్బును జేబులో వేసుకున్న తర్వాత బోర్డు తిప్పేస్తున్న సంస్థల జాబితాలో ఆదివారం సువర్ణ ఇండియా ఫైనాన్స్ చేరింది. రాజమండ్రి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ ప్రజల నుంచి దాదాపు రూ. 30 కోట్లకు పైగానే సేకరించినట్లు సమాచారం. అతి తక్కువ కాలంలోనే రెట్టింపు లాభాలు ఇస్తామన్న భోగస్ ప్రచారంతో రంగంలోకి దిగిన సువర్ణ ఇండియా, రాజమండ్రి సహా పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను తన బుట్టలో వేసుకుంది. సంస్థ నయా మోసాన్ని గుర్తించని లక్షల మంది అమాయక ప్రజలు కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టారు. అనుకున్న మేర నిధులు జేబులో పడగానే సువర్ణ ఇండియా యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా జారుకుంది. సంస్థ కార్యాలయాలన్నీ మూతపడిన తర్వాత కాని మోసాన్ని గుర్తించని ప్రజలు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాజోలు పోలీసులు, కంపెనీ వ్యవస్థాపకుడు గోలి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంస్థ ఎండీ వేణును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News