: కాశ్మీర్ కు రూ. 1,000 కోట్ల సాయం: ప్రధాని మోడీ ప్రకటన


వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ కు తక్షణ సాయంగా రూ. 1,000 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రకటించారు. కాశ్మీర్ వరదలపై ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ప్రధాని ఈ మేరకు ప్రకటన చేశారు. వరదల్లో మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించిన మోడీ, మరింత మేర సహాయం చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని వెల్లడించారు. కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించిన మోడీ, కేంద్రం నుంచి అందాల్సిన అన్ని రకాల సహాయాన్ని అందించనున్నామని కాశ్మీర్ ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News