: శ్రీనగర్ ను ముంచెత్తిన వరదలు
జమ్మూ, కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ ను వరదలు ముంచెత్తాయి. ఆదివారం శ్రీనగర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న రోజే రాజధాని నగరాన్ని వరద నీరు ముంచేసింది. దీంతో నగరంలో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మొబైల్ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. ఆరు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు, రాష్ట్రంలోని 2,500 గ్రామాల ప్రజలను ఇబ్బందుల పాల్జేశాయి. 450 గ్రామాలను వరదలు పూర్తిగా ముంచేశాయి.