: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కార్యవర్గ ఎన్నికలు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగుతున్న ఈ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ సీఏ అధ్యక్ష పదవి కోసం మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ తో పాటు మాజీ మంత్రి వినోద్ బరిలో నిలిచారు. ఇరువర్గాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికలపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ నడిచిన సంగతి తెలిసిందే. హెచ్ సీఏ అధ్యక్ష పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో వినోద్ అందుబాటులో ఉన్న ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు.