: కాశ్మీర్ వరదలు జాతీయ విపత్తే: ప్రధాని మోడీ


భారీ వర్షాలతో అతలాకుతలమైన జమ్మూ, కాశ్మీర్ లో వరదలను జాతీయ విపత్తుగానే పరిగణిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాశ్మీర్ లో వరద పరిస్థితిని సమీక్షించడంతో పాటు వరద ప్రాంతాలను పరిశీలించేందుకు ఆదివారం ఉదయం శ్రీనగర్ చేరుకున్నారు. అనంతరం మోడీ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు ఆ రాష్ట్ర సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని ఒమర్, మోడీకి వివరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి ఒమర్ వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోడీ, స్వాతంత్ర్యం తర్వాత కాశ్మీర్ లో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. భారీ నష్టాన్ని మూటగట్టిన ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. మీడియా సమావేశం అనంతరం మోడీ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

  • Loading...

More Telugu News