: వన్డేల్లో తిరిగి అగ్రస్థానంలో టీమిండియా!
వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా తిరిగి అగ్రస్థానానికి చేరింది. ఇంగ్లండ్ తో ముగిసిన టోర్నీలో మెరుగైన ప్రతిభను నమోదు చేసిన ధోనీ సేన 133.49 పాయింట్లతో దక్షిణాఫ్రికాను రెండో స్థానానికి నెట్టేసి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తద్వారా వన్డే క్రికెట్ లో తనకు ఎదురు లేదని చెప్పింది. గత వారం టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా అగ్రస్థానాన్ని పంచుకోగా, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో పేలవ ప్రదర్శనతో ఆస్ట్రేలియా నాలుగో స్థానానికి పడిపోయింది. అయితే ఆస్ట్రేలియాను మట్టికరిపించిన దక్షిణాఫ్రికా, తొలిస్థానానికి టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చినా, 112.96 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మూడో స్థానంలో లంక జట్టు కొనసాగుతోంది.