: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: గంటా నోట మళ్లీ అదే మాట!


త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్...ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గంటా శ్రీనివాసరావు నిత్యం చేస్తున్న ప్రకటన. మంత్రిగారి మాటలు నమ్మిన డీఎడ్ అభ్యర్థులతో పాటు బీఈడీ అభ్యర్థులు కూడా గత శుక్రవారం పొద్దుపోయేదాకా టీవీలకే అతుక్కుపోయారు. ఎందుకంటే, మంత్రి గారి మాట ప్రకారం ఆ రోజు డీఎస్సీ ప్రకటన వెలువడి తీరుతుందన్నది వారి నమ్మకం. అయితే రాత్రి 10 గంటలు దాటినా ప్రకటన విడుదల కాకపోయేసరికి, ఇక మంత్రిగారి మాట ఒట్టిమాటేనని తేల్చుకున్న అభ్యర్థులు నిరాశతోనే ముసుగు తన్నేశారు. తాజాగా ఆదివారం కూడా ‘‘త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నాం’’ అని గంటా ప్రకటించారు. అంతేకాక ఎస్జీటీ పోస్టులకు సంబంధించి బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పించే విషయంపై కేంద్రంతో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. అసలు డీఎస్సీ ప్రకటన విడుదలను నిలిపేసిన ఈ అంశం, ఎప్పటికి తేలుతుందో కూడా తెలియడం లేదు. అయినా అభ్యర్థులను ఊదరగొట్టేలా ఈ ప్రకటనలు చేయడం మంత్రిగారికి పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News