: వరద పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు
భారీ వర్షాలతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో వరద తీవ్రతను సమీక్షించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాలని ఈ సందర్భంగా సీఎస్ కు చంద్రబాబు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ... నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.