: ఐఫోన్ 6 కోసం ఆపిల్ ముందు జనం బారులు!


ఆపిల్ స్టోర్ల ముందు అప్పుడే జనం బారులు తీరుతున్నారు. గంటగంటకూ ఈ బారుల పొడవు పెరుగుతోందే తప్పించి తగ్గడం లేదు. అసలు ఎందుకోసం ఆపిల్ స్టోర్ల ముందు జనం బారులు తీరుతున్నారంటే, ఐఫోన్ 6 విడుదలవుతోంది మరి. అయితే, ఐఫోన్ 6ను ఆపిల్ ఇంకా విడుదల చేయలేదు కదా, అసలు ఫలానా తేదీ నాడు విడుదల చేస్తామని ప్రకటించను కూడా లేదు. అయితే మరి జనం ఎందుకు బారులు తీరుతున్నారు? సాధారణంగా ఏటా సెప్టెంబర్ 9న ఆపిల్ తన కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందేగా. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 9న ఆపిల్ తన కొత్త ఉత్పత్తి ఐఫోన్ 6ను విడుదల చేయనుందని అటు మార్కెట్ వర్గాలతో ఇటు ఆపిల్ అభిమాన వినియోగదారులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. దీంతోనే ఆపిల్ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా, జనం ఆపిల్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. మరి ఆపిల్ తన సంప్రదాయాన్ని కొనసాగించి వినియోగదారుల దాహార్తిని తీరుస్తుందో, లేక కొత్త సంప్రదాయానికి తెరతీసి వారి ఆశలపై నీళ్లు చల్లుతుందోనన్న విషయం మంగళవారం తేలిపోనుంది.

  • Loading...

More Telugu News