: షరీఫ్ ను గద్దె దించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఇమ్రాన్ ఖాన్


పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పి... దేశాన్ని, ప్రజలను మోసం చేసిన ప్రధాని నవాజ్ షరీఫ్ ను గద్దే దించే వరకు విశ్రమించమని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ లోని డీ-చౌక్ లో ఆందోళనకారుల (మద్దతుదారులు)ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని జి జిన్ పింగ్ పాక్ పర్యటన విషయంలో కూడా షరీఫ్ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చైనా ప్రధాని పాకిస్థాన్ లో పర్యటిస్తామని చెప్పలేదని... పర్యటించాలన్న ఆలోచనలో మాత్రమే ఉన్నారని ఖాన్ తెలిపారు. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ నాయకత్వాలు, పాక్ ఆర్మీపై పార్లమెంటులో షరీఫ్ అసత్యాలు మాట్లాడారని... ఈ వ్యవహారంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రధానిగా షరీఫ్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరతామని ఇమ్రాన్ తెలిపారు. తాము చేస్తున్న డిమాండ్లలో ఐదింటిని అంగీకరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని... అయితే, దీన్ని లిఖిత పూర్వకంగా మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News