: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు


ఖైరతాబాద్ కైలాస విశ్వరూప గణపతిని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినాయకుని ఆశీస్సులతో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగాలని గణనాథుడిని కోరుకున్నట్లు చెప్పారు. గణేశ్ ఉత్సవాలు కుల, మత భేదం లేకుండా కొనసాగుతున్నాయన్నారు. భారతదేశం సంస్కృతీ, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు నిలయమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు లోకమాన్య బాలగంగాధర తిలక్ ప్రారంభించిన గణేశ్ ఉత్సవాలను ఆదర్శంగా తీసుకుని మనం ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నామని వెంకయ్య అన్నారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు 60 ఏళ్లను పూర్తిచేసుకోవడం అభినందనీయమన్నారు. వెంకయ్యనాయుడు వెంట సికింద్రాబాదు ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, లక్ష్మణ్ తదితరులున్నారు.

  • Loading...

More Telugu News